8 కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం.. మండలి నిరవధిక వాయిదా
- చెత్తపన్ను చట్టాన్ని రద్దు చేసిన మండలి
- పీడీ యాక్ట్ 2024 సవరణ బిల్లుకు ఆమోదం
- జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 2024 రద్దు బిల్లును మండలి ఆమోదించింది. పీడీ యాక్ట్ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థల దేవాదాయ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది.
మరోవైపు, విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖను కోరుతూ శాసనమండలిలో తీర్మానం చేశారు. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తరువాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.