ఏపీకి భారీ వర్ష సూచన.. మంగళ, బుధ వారాల్లో భారీ వర్షం
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- వాయుగుండంగా బలపడి 27న తీరం దాటుతుందన్న ఐఎండీ
- కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీన పడి ఈ నెల 27న తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటుతుందని వెల్లడించారు. తుపాన్ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళ, బుధ వారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.