Wedding: కర్నూలులో వధూవరులను ఆశీర్వదించి వేదికపైనే కుప్పకూలిన యువకుడు.. వీడియో ఇదిగో!

Amazon Employee Greets Friend At Wedding Dies Of Cardiac Arrest
  • ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస వదిలిన అమెజాన్ ఉద్యోగి
  • కార్డియాక్ అరెస్టే కారణమన్న వైద్యులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వేదికపై వధూవరులకు గిఫ్ట్ ఇచ్చి, ఆశీర్వదించిన ఓ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగంలేకుండా పోయింది. మార్గమధ్యంలోనే అతను చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్నూలు జిల్లా పెనుమాడ గ్రామంలో గురువారం ఓ వివాహం జరిగింది. అతిథులు వధూవరులను ఆశీర్వదించి బహుమతులు అందజేస్తున్నారు. ఇంతలో పెళ్లికొడుకు స్నేహితుల బృందం వేదికపైకి చేరుకుంది. ఓ గిఫ్ట్ అందజేసి గ్రూఫ్ ఫొటో దిగుతుండగా వంశీ అనే యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వేదికపైనే పడిపోతుండగా పక్కనే ఉన్న స్నేహితులు పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు.

స్పృహ తప్పిన వంశీని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అతనిని పరిశీలించిన వైద్యులు.. ఆయన అప్పటికే చనిపోయాడని ప్రకటించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణం పోయిందని వెల్లడించారు. కాగా, వంశీ అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నాడని, ఈ పెళ్లికి హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి వచ్చాడని స్నేహితులు చెప్పారు.
Wedding
Viral Videos
Young Man
Death
Cardiac Arrest
Andhra Pradesh
karnool

More Telugu News