Russia: అమెరికాపై రష్యా దాడి చేసే అవకాశం ఉందన్న యూఎస్ ఇంటెలిజెన్స్

Russia may attack America warns US intelligence
  • వెయ్యి రోజులు దాటిన రష్యా - ఉక్రెయిన్ యుద్ధం
  • ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న కంపెనీలపై రష్యా దాడి చేసే అవకాశం
  • సదరు కంపెనీలు రక్షణ వ్యవస్థను పెంచుకోవాలన్న ఇంటెలిజెన్స్
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం వెయ్యి రోజులు దాటింది. యుద్ధ తీవ్రత తగ్గకపోగా... యుద్ధం అణుయుద్ధంగా కూడా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. అణ్వాయుధాలను ప్రయోగించే నిబంధనలను సరళతరం చేసే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. మరోవైపు అమెరికాపై రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ ఇంటెలిజెన్స్ అలెర్ట్ చేసింది. 

అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడి చేసే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న డిఫెన్స్ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సదరు కంపెనీలు రక్షణ వ్యవస్థను పెంచుకోవాలని సూచించింది.
Russia
USA

More Telugu News