పార్టీ మారుతున్నారనే వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందన
- కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయన్న అనిల్
- జగన్ ను వదిలే ప్రసక్తే లేదని వ్యాఖ్య
- వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా
తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని అనిల్ మండిపడ్డారు. దీని కోసం నారా లోకేశ్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఎందరో గొప్పవాళ్లు జైలుకు వెళ్లారని... తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.