వచ్చే ఏడాది కేరళకు రానున్న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ
Add ap7am to your home Screen

వచ్చే ఏడాది కేరళకు రానున్న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ

Lionel Messi set for India as Kerala sports minister announce
--
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ వచ్చే ఏడాది కేరళకు రానున్నారు. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టు కేరళకు రానుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి చాలా కాలంగా పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, మెస్సీ రాకపై తాజాగా కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దురహిమన్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించబోతున్నామని వివరించారు.

ఈ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టు కేరళకు వస్తుందని, జట్టులో ప్రముఖ ఆటగాడు మెస్సీ కూడా ఉంటారని బుధవారం తెలిపారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి.. అర్జెంటీనా మ్యాచ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ చరిత్రాత్మక మ్యాచ్ నిర్వహిస్తుందని, ఇందుకోసం రాష్ట్రంలోని వ్యాపారులు ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు.
Advertisement
Lionel Messi
Football
Kerala
Sports News
Messi

More Telugu News