బాబ్బాబు.. మీరు ఆఫీసులకు రావొద్దు.. ఇంటి నుంచే పని చేయండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం వినతి
- కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆదేశాలు
- కార్యాలయాల పని వేళలను సవరించిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా
- రాజధానిలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ 422గా నమోదు
నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిన్న ప్రభుత్వ కార్యాలయాల సమయాలను సవరించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కింద పనిచేసే కార్యాలయాలు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వం కింద పనిచేసే కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేసేలా సవరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.