ramraj cotton: రామ్‌రాజ్ కాటన్‌కు కొత్త అంబాసిడర్ వచ్చాడు!

ramraj cotton ropes in abhishek bachchan as its brand ambassador
  • రామ్‌రాజ్ కాటన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అభిషేక్ బచ్చన్
  • బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు వెల్లడించిన రామ్‌రాజ్ కాటన్ సంస్థ 
  • అభిషేక్ బచ్చన్‌ను నియమించుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన వ్యవస్థాపకుడు, చైర్మన్ కేఆర్ నాగరాజన్ 
రామ్‌రాజ్ కాటన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ దుస్తుల్లో రామ్‌రాజ్ కాటన్ ఒక బ్రాండ్. తెల్లని కాటన్ షర్టులు, లుంగీలు, ధోతీల విక్రయాల్లో రామ్‌రాజ్ కాటన్‌కు ప్రజాదరణ ఎంతగానో ఉంది. సాధారణంగా వ్యాపార వాణిజ్య సంస్థలు తమ వ్యాపార ఉత్పత్తుల విక్రయాల ప్రమోషన్‌కు సెలబ్రెటీలను బ్రాండ్ అంబాసిడర్‌ (ప్రచారకర్త)గా నియమించుకుంటుంటారు. 

అదే క్రమంలో రామ్‌రాజ్ కాటన్‌కు ఇకపై ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అభిషేక్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంపై సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. కంపెనీ మార్కెట్ విస్తరణకు, దుస్తుల విభాగంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ఈ నియామకం ఉపయోగపడుతుందని తెలిపింది. 

రామ్‌రాజ్ కుటుంబంలోకి అభిషేక్ బచ్చన్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందని రామ్‌రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కేఆర్ నాగరాజన్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధంతో అభిషేక్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. మరో పక్క రామ్‌రాజ్‌తో భాగస్వామ్యం పట్ల అభిషేక్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. సంస్థతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.   
ramraj cotton
brand ambassador
abhishek bachchan

More Telugu News