హైకోర్టు ఆదేశాలతో.. నేడు పోలీసు విచారణకు హాజరవుతున్న రామ్ గోపాల్ వర్మ
- చంద్రబాబు, పవన్, లోకేశ్ ల ఫొటోలు మార్ఫింగ్ చేసిన వర్మ
- వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రామలింగం
- ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు హాజరవుతున్న వర్మ
అయితే, తనను అరెస్ట్ నుంచి రక్షించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును రామ్ గోపాల్ వర్మ ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు... వర్మ విన్నపాన్ని తిరస్కరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. అరెస్ట్ చేయవద్దంటూ తాము ఆదేశాలు ఇవ్వలేవని తెలిపింది. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వర్మ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు పోలీసు విచారణకు వర్మ హాజరవుతున్నారు.