ప్రేమ పేరిట యువకుడి వేధింపులు.. భువనగిరిలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
- ఆదివారం యువతి ఫోన్‌కు అసభ్యకర సందేశాలు
- మనస్తాపానికి గురై ఉరేసుకున్న హాసిని
- నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రుల డిమాండ్
ఆదివారం హాసిని ఫోన్‌కు నిఖిల్ అసభ్యకరంగా సందేశాలు పంపడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఫ్యాన్‌కు వేలాడుతున్న హాసిని మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాసిని, నిఖిల్ భువనగిరిలోని ప్రైవేటు స్కూల్లో పదో తరగతి వరకు కలిసే చదువుకున్నారని, అప్పటి నుంచే తమ కుమార్తెను వేధిస్తున్నాడని, హాసిని చావుకు కారణమైన నిఖిల్‌ను కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.