Kakani Govardhan Reddy: సోమిరెడ్డి పనుల్లో భారీ అవినీతి: కాకాణి

There is lot of corruption in Somireddy works says Kakani Govardhan
  • టెండర్ల కంటే ముందే పనులు పూర్తి చేశారన్న కాకాణి
  • కనుపూరు కాలువ పనుల్లో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ
  • సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వానమని విమర్శ
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. టెండర్ల కంటే ముందే పనులను పూర్తి చేసిన ఘనత సోమిరెడ్డిదని విమర్శించారు. తూతూ మంత్రంగా పనులను పూర్తి చేసి నీళ్లు వదిలితే ఆ పనుల్లో నాణ్యత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 

కనుపూరు కాలువ పనుల్లో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని కాకాణి ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులు రిటైర్ అయినా సరే... జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వానంగా ఉందని మండిపడ్డారు. 

పాత కేసులు తిరగదోడి తనను భయపెట్టాలని చూస్తున్నారని... ఉడుత బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని... ఇది కరెక్ట్ కాదని చెప్పారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు.
Kakani Govardhan Reddy
YSRCP
Somireddy Chandra Mohan Reddy
Telugudesam

More Telugu News