Pawan Kalyan: పాకిస్థాన్ లోని హిందూ మహిళల గురించి పవన్ కల్యాణ్ భావోద్వేగం

Pawan Kalyan emotional on suicide of two Hindu girls in Pakistan
  • పాక్ లో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు హిందూ అమ్మాయిలు
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారీ ఎంతో బాధ కలుగుతుందని వ్యాఖ్య
పాకిస్థాన్ లో హేమ (15), వెంటి (17) అనే ఇద్దరు హిందూ అమ్మాయిలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... పాకిస్థాన్‌లో మన హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. 

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితి గురించి ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారీ తనకు చాలా బాధ కలుగుతుందని పవన్ అన్నారు. హేమ మరియు వెంటిల ఆత్మ శాంతి కోసం కన్నీళ్లతో ప్రార్థిస్తున్నానని చెప్పారు.

మరోవైపు, పాకిస్థాన్ లో హిందూ అమ్మాయిలపై ఇస్లాం మత ఛాందసవాదులు చేస్తున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం పాకిస్థాన్ లోని హిందువులపై జరుగుతున్న దారుణాలపై ఎందుకు సరిగా స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Pawan Kalyan
Janasena
Pakistan
Hindu

More Telugu News