పుష్ప-2 ట్రైలర్ లాంచ్ లో... చెప్పులు విసిరినవారిపై పోలీసుల లాఠీచార్జి
- బీహార్ లోని పాట్నాలో ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం
- స్టేడియంలో ఓ పక్కన చెలరేగిన గందరగోళం
- పరిస్థితిని చక్కదిద్దడానికి యత్నించిన పోలీసులపైకి చెప్పులు విసిరిన కొందరు.
అయితే ట్రైలర్ విడుదలకు ముందు స్టేడియంలో ఓ పక్కన కాస్త గందరగోళం చెలరేగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. కాసేపు ఓపిక పట్టిన పోలీసులు... చివరికి ఆగ్రహంతో లాఠీచార్జి చేశారు. అయితే ఇది కేవలం పోలీసులకు, స్టేడియంలోకి వచ్చిన అభిమానులకు మధ్యే జరిగింది. ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచింగ్ కు ఎలాంటి సంబంధం లేదు.