నటి కస్తూరి కోసం ఏపీలో గాలిస్తున్న తమిళనాడు పోలీసులు

Tamil Nadu police searches for Kasthuri in AP
తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన నటి కస్తూరి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కస్తూరికి ఇటీవల నోటీసులు ఇచ్చేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నించగా, ఆమె ఇంటికి తాళం వేసి కనిపించింది. దాంతో ఆమె పరారీలో ఉన్నట్టు నిర్ధారించారు. 

అనంతరం, ముందస్తు బెయిల్ కోరుతూ కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, చెన్నై పోలీస్ కమిషనర్ తాజాగా కస్తూరి కోసం ఓ స్పెషల్ పోలీస్ టీమ్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపించారు. కస్తూరి ఏపీలో ఉండొచ్చన్న అనుమానంతో చెన్నై పోలీసులు ఇక్కడ కూడా గాలించనున్నారు. 

కాగా, కస్తూరి తమిళనాడు నుంచి పరారవడానికి ఓ కోలీవుడ్ నిర్మాత సహాయపడినట్టు తెలుస్తోంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో కస్తూరి బీజేపీ తరఫున ప్రచారం చేసినా, తాజా వివాదం నేపథ్యంలో బీజేపీ కూడా ఆమెకు దూరంగా ఉంటోంది.
Go Back to Shorts
Kasthuri
Anti Telugu People Remarks
Chennai Police
Andhra Pradesh
Tamil Nadu

More Telugu News