Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సాయం

Tollywood Music Director Thaman Helped To Kidney Transplant
  • ఏఐఎన్‌యూ ఆసుపత్రిలో రోగికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్
  • విషయాన్ని వెల్లడించిన డాక్టర్ లీలాకృష్ణ
  • నీ కైండ్ హార్ట్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానంటూ పోస్ట్
  • ‘గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్’ అంటూ తమన్ రిప్లై
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. చావుబతుకుల్లో ఉన్న ఓ రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించడంలో సాయం చేశారు. ఆయన చొరవతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్టు డాక్టర్ లీలాకృష్ణ తన ఇన్‌గ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘థ్యాంక్యూ డియర్ తమన్. ఏఐఎన్‌యూ ఆసుపత్రిలోని రోగికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌ను విజయవంతంగా జరిగేలా చూశావు. నీ కైండ్ హార్ట్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్’ అంటూ లీలాకృష్ణకి తమన్ రిప్లై ఇచ్చారు. తమన్ మంచి మనసు గురించి తెలుసుకున్న అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు. 

టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న తమన్ స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. బుల్లితెర మ్యూజిక్‌ షోలకు తమన్ న్యాయ నిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమన్ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. అందరికంటే ముందుగానే తాను సంగీతం అందిస్తున్న చిత్రాల అప్డేట్స్ పంచుకుంటారు.    
Thaman
AINU
Kidney Transplant
Music Director
Tollywood

More Telugu News