Jharkhand Assembly Polls: ఝార్ఖండ్ లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్

First phase polling in Jharkhand going on
షార్ట్స్‌లో చూడండి
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేడు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా... నేడు మొదటి దశలో 43 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 43 నియోజకవర్గాల్లో 683 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 46.25 శాతం పోలింగ్ నమోదైంది. 

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 

ఇక, ఝార్ఖండ్ లోని మిగిలిన 38 స్థానాల్లో ఈ నెల 20న రెండో విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. 

గతంతో పోల్చితే ఈసారి ఝార్ఖండ్ లో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా ఉంది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అధికారం నిలుపుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుండగా... ఝార్ఖండ్ లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది.
Go Back to Shorts
Jharkhand Assembly Polls
First Phase
Polling
JMM
BJP

More Telugu News