కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు... బీజేపీ కీలక నిర్ణయం!
- ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని పాదయాత్ర చేపట్టనున్న బీజేపీ
- అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయం
- మూసీ ప్రాంతంలో రాత్రి బస చేయాలని బీజేపీ నిర్ణయం
నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది. అదే సమయంలో ఈ నెల 15వ తేదీన లేదా 16వ తేదీన మూసీ పరీవాహక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బస చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. మూసీ ప్రాంతంలో బస చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రాత్రివేళ అక్కడ బస చేయనున్నారు.