Patents: పేటెంట్ల నమోదులో భారత్ దూకుడు... వరల్డ్ టాప్-6లోకి ఎంట్రీ

India enters top 6 in most patent filings
  • వినూత్న ఆవిష్కరణలపై మేధో హక్కులు కోరుతూ దరఖాస్తులు
  • 2023లో భారత్ లో 64,480 దరఖాస్తులు దాఖలు
  • ఈ జాబితాలో చైనా నెంబర్ వన్
గత కొంతకాలంగా వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి భారతీయుల నుంచి పేటెంట్ హక్కుల కోసం వస్తున్న దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2018 నుంచి 2023 మధ్య కాలంలో భారత్ లో పేటెంట్లు, పారిశ్రామిక డిజైన్లు, ట్రేడ్ మార్కు లైసెన్స్ లకు సంబంధించిన మేధోపరమైన హక్కులు కోరుతూ దరఖాస్తులు రెట్టింపయ్యాయయని డబ్ల్యూఐపీఓ (వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్) తాజా నివేదిక వెల్లడించింది. 

భారత్ మొదటిసారిగా మేధోపరమైన హక్కుల దరఖాస్తుల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించింది. డబ్ల్యూఐపీవో నివేదిక ప్రకారం... దీనికి సంబంధించి అత్యధిక దరఖాస్తులతో చైనా అగ్రస్థానంలో ఉంది. 2023లో చైనాలో 10 లక్షల 64 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి. 

ఈ జాబితాలో చైనా తర్వాత అమెరికా (5.18 లక్షలు), జపాన్ (4.14 లక్షలు), దక్షిణ కొరియా (2.87 లక్షలు), జర్మనీ (1.33 లక్షలు) టాప్-5లో ఉన్నాయి. ఇక భారత్... 64,480 పేటెంట్ దరఖాస్తులతో 6వ స్థానంలో నిలిచింది.
Patents
Filings
India
WIPO

More Telugu News