Crime News: యువకుడి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాల వెల్లడి

Man Dies by Suicide After Finding Wife in Compromising Position With Her Brother
  • అహ్మదాబాద్‌లోని ధోక్లాలో ఘటన
  • మహిళ తన సోదరుడితోనే సన్నిహితంగా ఉండగా చూసిన భర్త
  • మనస్తాపంతో ఆత్మహత్య
  • మహిళ, మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు
భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అహ్మదాబాద్‌లోని ధోక్లాలో నివసించే వ్యక్తి (35) ఈ నెల 7న ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు వెల్లడించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువకుడికి 2009లో ఓ యువతితో వివాహమైంది. ఆ తర్వాత 2017లో ఇద్దరూ చట్టబద్ధంగా విడిపోయారు. అనంతరం యువకుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో వివాహం చేసుకున్నాడు. అతడు వివాహం చేసుకున్న అమ్మాయి అప్పటికే నలుగురిని పెళ్లి చేసుకుని విడిపోయింది. 

ఈ క్రమంలో ఓ రోజు భార్య తన సోదరుడితోనే సన్నిహితంగా మెలగడం చూసిన భర్త తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆమె గురించి ఆరా తీయగా గతంలో ఆమెకు విడాకులు ఇచ్చిన నలుగురు కూడా ఇలాంటి కారణంగానే విడిపోయినట్టు తెలిసింది. ఆమె తన సోదరుడితో సన్నిహితంగా ఉండడంతోనే విడాకులు ఇచ్చినట్టు తెలుసుకున్నాడు. భార్య గుణం గురించి తెలిసిన భర్త ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో మృతుడి భార్య, మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Crime News
Ahmedabad
Gujarat

More Telugu News