సీఎం చంద్రబాబుపై పోస్టులు... మాజీ మంత్రి కాకాణిపై పోలీసు విచారణ
- ఇటీవల సీఎం చంద్రబాబుపై అసభ్యకరంగా కాకాణి పోస్టులు!
- టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు
- నేడు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన కాకాణి
కాకాణి ఇవాళ వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఆయనను పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంపై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విమర్శల దాడి తీవ్రమైంది. దాంతో, ప్రభుత్వ పెద్దలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.