Heavy Rains: ముంచుకొస్తున్న అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు

Heavy Rains Predicted To South Coastal Andhra And Rayalaseema
  • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • రేపు ఉదయానికి అల్పపీడనంగా మారే అవకాశం
  • 11 నుంచి మూడు రోజులపాటు వర్షాలు
  • మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమకు మరోమారు భారీ వర్ష ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ దిశగా పయనించి తమిళనాడు, శ్రీలంక తీరంపైపు వెళ్తుందని వాతావరణశాఖ తెలిపింది. 

అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. 
Heavy Rains
Andhra Pradesh
Coastal Andhra
Rayalaseema

More Telugu News