హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎల్లుండి నీటి సరఫరాకు అంతరాయం
- మరమ్మతుల కారణంగా 11వ తేదీన నీటి సరఫరాలో అంతరాయం
- ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు
- ఆర్‌సీ పురం, లింగంపల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రభావం
ఆర్‌సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, కెపీహెచ్‌బీ, మూసాపేట, చందానగర్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదన్నారు. స్థానికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.