Revanth Reddy: రేవంత్ రెడ్డిని ఫొటో తీస్తూ మూసీలోకి జారిపడిన ఫొటోగ్రాఫర్... వీడియో ఇదిగో!

Photographer slipped into Musi River while taking CM photo
  • యాత్రకు ముందు సంగెం వద్ద మూసీ వద్దకు వెళ్లిన సీఎం
  • మూసీ వద్దకు వెళ్లి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్
  • పైకి లేవడానికి ఫొటోగ్రాఫర్‌కు సాయం చేసిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫొటో తీస్తూ ఓ ఫొటోగ్రాఫర్ కాలుజారి మూసీ నదిలో పడిపోయాడు. మూసీ పునరుద్ధరణ యాత్ర ప్రారంభించడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంగెం శివయ్యకు పూజలు చేశారు. ఆ తర్వాత మూసీ నది వద్దకు వెళ్లి ఓ బాటిల్‌లో నీటిని తీసుకున్నారు.

ఈ సమయంలో ఓ ఫొటో జర్నలిస్టు కాస్త ముందుకు వచ్చి సీఎంను ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. కానీ కాలు జారి మూసీ నదిలో పడిపోయాడు. ఆ పక్కనున్న వారు అతనిని పట్టుకున్నారు. సీఎం సెక్యూరిటీలోని ఓ పోలీస్ అధికారి కూడా ఆయనకు సాయం చేశారు.

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద ప్రారంభమైన యాత్రకు రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ యాత్ర భీమలింగం వరకు కొనసాగింది. సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Revanth Reddy
Musi River
Telangana
Congress

More Telugu News