Cricket: 2025లో తండ్రి కాబోతున్న భారత్ క్రికెటర్... గ్రాండ్‌గా ప్రకటన

KL Rahul will welcome their firstborn in 2025
  • తల్లిదండ్రులు కాబోతున్న కేఎల్ రాహుల్, అథియా శెట్టి దంపతులు
  • స్పెషల్ పోస్టర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించిన టీమిండియా క్రికెటర్
  • 2025లో బేబీ రాబోతోందని వెల్లడి
ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి తెగ తంటాలు పడుతున్న భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గుడ్‌న్యూస్ చెప్పాడు. తన భార్య, బాలీవుడ్ నటి అథియా శెట్టి గర్భవతి అని వెల్లడించాడు. 2025లో తండ్రి కాబోతున్నట్టు ఇవాళ (శుక్రవారం) ప్రకటించాడు. అథియాతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. ‘‘అందమైన మా బిడ్డ త్వరలోనే వస్తుంది’’ అని తెలుపుతూ ఆకర్షణీయమైన పోస్టర్‌‌ను షేర్ చేశాడు. పోస్టర్‌పై 2025 నంబర్ పక్కన చిన్నారి పాదముద్రలు ఉన్నాయి. ‘‘అథియా అండ్ రాహుల్’’ అని కింది భాగంలో రాసి ఉంది.

కాగా తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్న రాహుల్, అథియా దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే జనవరిలో ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కేఎల్ రాహుల్, అథియా శెట్టి ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అథియా శెట్టి ఈ మంగళవారం 32వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పి ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను షేర్ చేశాడు.
Cricket
KL Rahul
Team India
Sports News

More Telugu News