కన్నడ హీరో శివరాజ్ కుమార్ కు ఏమైంది?

  • శివరాజ్ కుమార్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా వార్తలు
  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నది నిజమేనని వెల్లడించిన హీరో
  • త్వరలోనే సర్జరీ కోసం అమెరికా వెళుతున్నానని వెల్లడి
  • ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ట్రీట్ మెంట్ తీసుకున్నట్టు వివరణ
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన నిజంగానే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా? అనే విషయం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. 

అయితే, శివరాజ్ కుమార్ తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా పెదవి విప్పారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ విషయం బయటపెడుతున్నానని తెలిపారు. 

ఇప్పటివరకు నాలుగు విడతలుగా ట్రీట్ మెంట్ తీసుకున్నానని వెల్లడించారు. ప్రస్తుతం కూడా చికిత్స కొనసాగుతోందని శివరాజ్ కుమార్ స్పష్టం చేశారు. నేను కూడా మనిషినే... నాకు కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయని అన్నారు. 

తొలిసారిగా తన అనారోగ్యం గురించి తెలుసుకున్నప్పుడు తీవ్ర ఆందోళన కలిగిందని, అయితే, ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యను అధిగమించాలని అనుకున్నానని తెలిపారు. ఫ్యాన్స్, ప్రజలు తన అనారోగ్యం గురించి తెలిస్తే బాధపడతారని, అది తనకు ఇష్టం లేదని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు కలత చెందాల్సిన అవసరంలేదని తెలిపారు. 

త్వరలోనే సర్జరీ కోసం అమెరికా వెళుతున్నానని, నెలరోజులు రెస్ట్ తీసుకుంటానని వెల్లడించారు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని భావిస్తున్నానని... షూటింగులు, ప్రమోషన్స్ కు హాజరవుతున్నానని శివరాజ్ కుమార్ వివరించారు.


More Telugu News

Shiva Rajkumar Health Hero Kannada Karnataka