కమల్‌హాసన్, మణిరత్నం 'థగ్ లైఫ్' టీజర్ విడుదల
- కమల్‌హాసన్ బర్త్‌డే సందర్భంగా 'థగ్‌లైఫ్' టీజర్ విడుదల
- 37 ఏళ్ల తరువాత రిపీట్ అవుతున్న కాంబినేషన్
- 2025 జూన్ 5న 'థగ్‌లైఫ్' విడుదల
మళ్లీ దాదాపు 37 సంవత్సరాల విరామం తరువాత ఈ సెన్సేషన్ జోడీ 'థగ్‌లైఫ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శింబుతో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. నేడు (నవంబరు 7) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'థగ్‌లైఫ్' టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌లోనే చిత్రాన్ని 2025 జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది.