Donald Trump: అన్ స్టాపబుల్ విక్టరీ... ట్రంప్ కు అభినందనలు తెలిపిన నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna congratulates Donald Trump

 


 యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పర్వంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయభేరి మోగించారు. దాంతో ఆయనపై అంతర్జాతీయ ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా, టాలీవుడ్ అగ్రకథానాయకుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ట్రంప్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

"అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండో సారి ఘనవిజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు డొనాల్డ్  ట్రంప్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త శకానికి నాందిగా నిలుస్తుంది. అన్ స్టాపబుల్ గా విజయం సాధించిన విధంగా భారత్-అమెరికా ల మధ్య కూడా అన్ స్టాపబుల్ గా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని, అభివృద్ధిలో పరస్పర సహకారం అందించాలని కోరుతున్నాను.  అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భద్రతకు సహకరించాలని కోరుతున్నాను. 

Donald Trump
US Presidential Polls
Balakrishna
Andhra Pradesh
  • Loading...

More Telugu News