Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అవాంఛిత రికార్డు.. తీవ్ర విమర్శలు

Here is the Indian captains list with most losses at home in Test matches

  • స్వదేశంలో అత్యధిక టెస్ట్ ఓటములు ఎదుర్కొన్న రెండవ కెప్టెన్‌గా నిలిచిన రోహిత్ శర్మ
  • 16 మ్యాచ్‌లు ఆడగా 5 ఓటములు చూవిచూసిన హిట్‌మ్యాన్
  • మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సారధ్యంలో అత్యధిక ఓటములు ఎదుర్కొన్న భారత జట్టు  

ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024ను గెలిపించి అందరి ప్రశంసలు అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో అవమానకర రీతిలో కోల్పోవడమే ఇందుకు కారణమవుతోంది. మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ స్వదేశంలో వైట్‌వాష్‌కు గురికావడం చాలా కాలం తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ ఓటమి రోహిత్ శర్మ కెరీర్‌లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. మరోవైపు కివీస్ చేతిలో వరుసగా ఎదుర్కొన్న ఈ మూడు ఓటములతో రోహిత్ శర్మ ఖాతాలో ఓ అవాంఛిత రికార్డు చేరింది. స్వదేశంలో అత్యధిక టెస్ట్ ఓటములు చవిచూసిన రెండవ భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.

స్వదేశంలో అత్యధిక టెస్టులు ఓడిన కెప్టెన్లు వీళ్లే.. 
1. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ
స్వదేశంలో అత్యధిక టెస్ట్ ఓటములు మూటగట్టుకున్న కెప్టెన్ల జాబితాలో మాజీ దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన సారధ్యంలో భారత జట్టు స్వదేశంలో మొత్తం 27 టెస్టులు ఆడగా అందులో 9 పరాజయాలు ఎదురయ్యాయి.

2. రోహిత్ శర్మ
టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. అతని కెప్టెన్సీలో భారత జట్టు ఇప్పటివరకు 16 టెస్టులు ఆడగా 5 పరాజయాలను రోహిత్ ఎదుర్కొన్నాడు. ఈ ఐదు ఓటములు తాజాగా న్యూజిలాండ్ చేతిలోనే కావడం గమనార్హం.

3. మహ్మద్ అజారుద్దీన్
మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సారధ్యంలో భారత జట్టు మొత్తం 20 టెస్టులు ఆడగా 4 ఓటములు ఎదురయ్యాయి.

4. కపిల్ దేవ్
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో 20 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అయితే నాలుగు టెస్టుల్లో జట్టు ఓటమి పాలైంది.

5. బిషన్ సింగ్ బేడీ
ఈ జాబితాలో మాజీ దిగ్గజ బౌలర్ బిషన్ సింగ్ బేడీ 5వ స్థానంలో ఉన్నారు. ఆయన సారధ్యంలో భారత జట్టు స్వదేశంలో 8 టెస్టులు ఆడగా 3 మ్యాచ్‌ల్లో ఆయన ఓటమి చవిచూశారు.

Rohit Sharma
Mansur Ali Khan Pataudi
Team India
India vs New Zealand
  • Loading...

More Telugu News