Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో కేదారీశ్వర వ్రతం.. పాల్గొన్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy Visits Senior Leader VH Home In Hyderabad
      
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంటికి వెళ్లారు. కార్తీక మాసం సందర్భంగా వీహెచ్ కుటుంబం హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలోని నివాసంలో గత రాత్రి కేదారీశ్వర వ్రతం నిర్వహించింది. ఆయన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు వీహెచ్ ఇంటికి వెళ్లి వ్రతంలో పాల్గొన్నారు. 

సీఎం, మంత్రుల రాకతో బాగ్ అంబర్‌పేట సందడిగా మారింది. వ్రతం అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.. దీపావళి తర్వాత కేదారీశ్వర వ్రతం ఆచరించడం తమ పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
Revanth Reddy
V.Hanumantha Rao
VH
Congress
Kedareeswara Vratham

More Telugu News