కుమార్తె పేరును ప్రకటించిన దీపికా, రణవీర్ దంపతులు
- 'దువా పదుకొణె సింగ్'గా నామకరణం
- చిన్నారి పేరుకు అర్ధం కూడా వెల్లడి
- రణ్వీర్ – దీపిక పోస్టుకు స్పందిస్తున్న అభిమానులు, సినీ ప్రముఖులు
‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్కు సమాధానమే’ ఈమె అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అభిమానులతో పాటు ఆలియా భట్, మమితా బైజు, షాలినీ పాండే తదితర సినీ ప్రముఖులు స్పందించారు. క్యూట్ అంటూ లవ్ ఎమోజీలు జోడించారు.
2018లో రణ్వీర్ – దీపిక వివాహ బంధంతో ఒకటయ్యారు. కల్కి 2898 ఏడీతో అలరించిన దీపిక..సింగమ్ అగైన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఇందులో రణ్వీర్ అతిథి పాత్రలో సందడి చేశారు. మరో వైపు ..ధురంధన్ మువీలో బిజీగా ఉన్నారు.