భారీ వర్షంతో తడిసిముద్దయిన హైదరాబాద్ నగరం
- నగరంలో మధ్యాహ్నం వరకు ఎండ
- ఆ తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణం
- గంట పాటు భారీ వర్షం
- నగరంలోని పలు ప్రాంతాలు జలమయం
లింగపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద భారీ నీరు నిలవడంతో, ఆ మార్గంలో ట్రాఫిక్ ను ఆపేశారు. గచ్చిబౌలి-లింగపల్లి రూట్లో వచ్చే వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా మళ్లించారు. ఓ చోట ఆర్టీసీ బస్సులోకి నీరు ప్రవేశించడం సోషల్ మీడియాలో ఓ వీడియోలో కనిపించింది.
హైదరాబాదులో ఇవాళ మధ్యాహ్నం వరకు వాతావరణం వేడిగా ఉండగా... ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం తెలిసిందే.