17 ఏళ్ల అమ్మాయి ద్వారా 19 మందికి ఎయిడ్స్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
- ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఘటన
- హెరాయిన్‌కు బానిసైన యువతి
- కొనుక్కునేందుకు తనకు సాయం చేసిన వారితో శారీరక సంబంధం
- యువకులు అనారోగ్యం బారినపడటంతో విషయం వెలుగులోకి
- అప్రమత్తమైన ప్రభుత్వం
ఎలా బయటపడింది?
యువకులు అనారోగ్యం బారినపడడంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వారికి హెచ్ఐవీ సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం వారికి రామ్‌దత్ జోషి జాయింట్ ఆసుపత్రిలోని ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ)లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసైన యువతికి డబ్బులు సాయం చేసిన యువకులు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, వీరు కాకుండా మరెంతోమంది ఆమె దగ్గర ఎయిడ్స్ బారినపడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
నైనిటాల్‌లో ఒక్కసారిగా హెచ్ఐవీ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏడాదికి దాదాపు 20 హెచ్ఐవీ పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని, కానీ, కేవలం 5 నెలల్లోనే 19 కేసులు వెలుగు చూడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని నైనిటాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హరీశ్ చంద్ర పంత్ తెలిపారు. రామ్‌నగర్‌లో గత 17 నెలల్లో ఏకంగా 45 మంది హెచ్ఐవీ బారినపడినట్టు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.