P Narayana: రాజధాని అమరావతి, డిజైన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

Minister Narayana says will use AI technology in Amaravati development
  • అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదన్న మంత్రి
  • రాజధాని నిర్మాణంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తామని వెల్లడి
  • పాత టెండర్ల గడువు ముగిసినందున కొత్త టెండర్లు పిలుస్తామన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... రాజధాని నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామన్నారు. రాజధాని అభివృద్ధి పనుల కోసం వచ్చే నెల 15 నుంచి డిసెంబర్ 31 లోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

పాత టెండర్ల గడువు ముగిసినందున న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు కొత్త టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో వచ్చే జనవరి నుంచి రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఆపేది లేదన్నారు. ఐదేళ్లలో ప్రజల ఆదాయం రెట్టింపు కావాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.
P Narayana
Andhra Pradesh
Amaravati

More Telugu News