ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. జస్ప్రీత్ బుమ్రాకు షాక్
- ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా అవతరించిన కగిసో రబాడ
- రెండు స్థానాలు దిగజారి 3వ ర్యాంకులో నిలిచిన భారత స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రా
- 2వ స్థానం నుంచి 4వ ర్యాంకుకు పడిపోయిన స్పిన్నర్ అశ్విన్
మరో భారత బౌలర్ రవీంద్ర జడేజా కూడా రెండు స్థానాలు కోల్పోయి ఎనిమిదో స్థానానికి దిగజారాడు. రెండవ టెస్టులో స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోవడం భారత బౌలర్ల ర్యాంకింగ్స్ పడిపోవడానికి కారణమైంది. ఇక పాకిస్థాన్ బౌలర్ నోమన్ అలీ టాప్-10లోకి ప్రవేశించి 9వ స్థానంలో నిలిచాడు.
ఐసీసీ టాప్-10 బౌలర్లు వీళ్లే..
1. కగిసో రబాడ - 860 పాయింట్లు
2. జాష్ హేజిల్‌వుడ్ - 847 పాయింట్లు
3. జస్ప్రీత్ బుమ్రా - 846 పాయింట్లు
4. రవిచంద్రన్ అశ్విన్ - 831 పాయింట్లు
5. పాట్ కమ్మిన్స్ - 820 పాయింట్లు
6. నాథన్ లియాన్ - 801 పాయింట్లు
7. ప్రభాత్ జయసూర్య - 801 పాయింట్లు
8. రవీంద్ర జడేజా - 776 పాయింట్లు
9. నోమన్ అలీ - 759 పాయింట్లు
10. మాట్ హెన్రీ - 743 పాయింట్లు