హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఆంక్షలు: సీవీ ఆనంద్‌

Police Restrictions in Hyderabad Till November 28th
  • బెటాలియన్‌ కానిస్టేబుళ్ల ఆందోళన ఉద్ధృతం
  • త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌ని ప‌క్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చ‌రిక‌
  • ఈ నేపథ్యంలోనే ‌హైదరాబాద్‌‌లో ఆంక్షలు 
  • నేటి నుంచి నవంబర్ 28 వరకు సమావేశాలు, ర్యాలీల‌పై నిషేధం
ఏక్‌ పోలీస్‌ విధానం అమలు, సస్పెండ్‌ చేసిన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు గ‌త కొన్నిరోజులుగా చేస్తున్న ఆందోళన ఉద్ధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని బెటాలియన్‌ కానిస్టేబుళ్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. 

నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ తెలిపారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్న‌ట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేర‌కు ఆంక్షలు విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

నేటి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు సమావేశాలు, ర్యాలీలు, సభలు, ధర్నాలు, రాస్తారోకోల‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఆంక్ష‌ల్లో భాగంగా ఐదుగురికి మించి ఒక‌చోట‌ గుమికూడితే క‌ఠిన‌ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Go Back to Shorts
Hyderabad
Telangana
Police Restrictions
CV Anand

More Telugu News