ధరణి పోర్టల్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
- ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ
- మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణకు కుదిరిన ఒప్పందం
- పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని వెల్లడి
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసీతో ఒప్పందం కుదిరినట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పనితీరు బాగుంటే ఒప్పందాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తామని తెలిపింది. భూముల రికార్డ్స్ మెయింటెనెన్స్‌లో పారదర్శకత, వేగవంతం కోసం పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థకు అప్పగించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.