తిరుపతి జిల్లా చిల్లకూరులో దారుణం.. టీడీపీ నేత సజీవ దహనం
- నిద్రిస్తున్న హరిప్రసాద్‌పై పెట్రోలు పోసి నిప్పంటించిన దుండగులు
- వైసీపీ కార్యకర్తలే ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ
- నాంచారంపేటలో ఉద్రిక్తత
- రాజకీయ కక్షలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
అర్ధరాత్రి తర్వాత ఇంటికి చేరుకున్న ఆయన గాఢ నిద్రలో ఉండగా కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వైసీపీకి చెందిన కట్టా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దుంపల మధు, ఆయన సహచరులు ఈ దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.