డ్రోన్ సమ్మిట్ ప్రారంభం
- మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా 'అమరావతి డ్రోన్ సమ్మిట్-2024'
- స్వయంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు
- ఈ సమ్మిట్ రెండు రోజులపాటు జాతీయస్థాయిలో జరుగుతుందని అధికారుల వెల్లడి
రెండు రోజులపాటు ఈ సమ్మిట్ జాతీయస్థాయిలో జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ, తొమ్మిది ప్యానల్ డిస్కషన్లు తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.