అనంతపురంలో భారీ వర్షం .. నీట మునిగిన కాలనీలు
- పండమేరు వాగు ఉద్ధృతితో కాలనీలోకి వరద నీరు
- ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
- హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
పండమేరుకు వరద పోటెత్తడంతో ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ పూర్తిగా నీట మునిగింది. మరో వైపు కనగానపల్లి మండలం ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారి పైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పెట్రోల్ బంక్ లోకి నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి వరద పంటమేరులోకి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉద్ధృతితో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.


.