Nandamuri Balakrishna: సీఎం చంద్రబాబుతో, బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-4 ఫస్ట్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తి

With CM Chandrababu Balakrishna Unstoppable 4 first episode shooting is complete

  • ఆసక్తికరంగా కొనసాగనున్న సీజన్‌ -4ఎపిసోడ్స్‌ 
  • సీఎం చంద్రబాబుతో  ఎపిసోడ్‌ను పూర్తి చేసిన బాలకృష్ణ 
  • ఈ నెల 25న ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్న తొలి ఎపిసోడ్‌

వెండితెరపై తన నటనతో అందరినీ అలరించే అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై అన్‌స్టాపబుల్‌ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రసారమవుతున్న ఈ అన్‌స్టాపబుల్‌ సీజన్‌కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఈ కార్యక్రమంతో బాలకృష్ణ ఎంతో మంది కొత్త అభిమానులను సంపాందించుకున్నారు. 

ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్‌లను విజయవంతంగా పూర్తిచేసిన నందమూరి బాలకృష్ణ తాజాగా నాలుగో సీజన్‌ ఎపిసోడ్‌లకు శ్రీకారం చుట్టారు. ఇటీవల అల్లు అర్జున్‌తో ఒక ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తిచేశారు.

తాజాగా ఆదివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు విచ్చేసి  సీజన్‌-4 కు సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిథిగా పూర్తిచేసిన ఈ కార్యక్రమం ఆహాలో ఈ నెల 25న రాత్రి 8:30 నిమిషాలకు స్ట్రీమింగ్‌ కానుంది. 

ఈ ఎపిసోడ్‌ బాలకృష్ణ-చంద్రబాబు మధ్య ఎంతో ఆసక్తికరంగా కొనసాగిందని, బాలకృష్ణ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు, ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు సీఎం అయిన తరువాత వచ్చిన మార్పులు ఇలా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగిందని సమాచారం. అందరూ ఈ ఎపిసోడ్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Nandamuri Balakrishna
CM Chandrababu naidu
UnstoppableWithNBK
NBKwithCBN
Unstoppable-4
Aha
  • Loading...

More Telugu News