మూసీ నీళ్లతో స్నానం చేసేలా... తాగేలా బాగు చేస్తాం: మంత్రి సీతక్క
- స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క
- 172 స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.3.44 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు వెల్లడి
- ఇందులో రూ.1.4 లక్షలు ఉచితంగా ఇస్తున్నామన్న మంత్రి
172 స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.3.44 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. మనం జీవించే పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అందుకే మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు. మూసీ నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. మూసీ నిర్వాసితుల్లోని ఒక్కో మహిళకు రూ.2 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో రూ.1.4 లక్షలు ఉచితంగా ఇస్తున్నామని, మిగతా మొత్తం నెలకు రూ.2 వేలు మూడేళ్ల పాటు చెల్లించాలన్నారు.