Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు బంధువులపై మియాపూర్‌లో కేసు నమోదు

Police Case Filed Against BRS MLA Harish Rao Relatives
     
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బంధువులపై కేసు నమోదైంది.  తన ఐదంతస్తుల భవనంలో హరీశ్‌రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్‌కుమార్‌గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోస్మో హాస్పిటాలిటీ పేరుతో ప్రామిసరీ నోటు తీసుకుని చీటింగ్‌కు పాల్పడ్డారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలియకుండానే వారు తన ఇంటిని అమ్మేశారని ఆరోపించారు. ప్రభావతి తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారని పేర్కొన్నారు. లచ్చిరాజు ఫిర్యాదుపై ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Harish Rao
BRS
Miyapur
Crime News

More Telugu News