ఈ ఏడాది ఫెమినా మిస్‌ ఇండియాగా నిఖిత పోర్వాల్‌

Nikita Porwal Crowned as the Femina Miss India 2024
  • మధ్యప్రదేశ్ అందాల భామ‌ను వ‌రించిన మిస్ ఇండియా టైటిల్‌
  • మొదటి, రెండవ రన్న రప్‌లుగా రేఖా పాండే, ఆయుశీ దోలకియా
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ర్షం వ్య‌క్తం చేసిన నిఖిత పోర్వాల్‌
మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్‌ ఈ ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన ఈవెంట్‌లో నిఖిత విజయం సాధించారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన నందిని గుప్తా విజేత‌ నిఖిత పోర్వాల్ కు కిరీటాన్ని అలంక‌రించారు. 

నిఖిత మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక తాజాగా జరిగిన ఈవెంట్‌లో రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్నరప్‌లుగా నిలిచారు.

ఈ 60వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో 29 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు చెందిన అందాల భామ‌లు పోటీప‌డ్డారు. తుదిపోరులో అద‌ర‌గొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 

విజేత‌గా నిలిచిన నిఖిత పోర్వాల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. "ఈ ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేను. నా తల్లిదండ్రుల క‌ళ్ల‌లో ఆనందం చూసి గ‌ర్వంగా ఉంది. నా ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంది. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది" అని ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
Go Back to Shorts
Femina Miss India 2024
Nikita Porwal

More Telugu News