హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాల కలకలం
- రియల్ ఎస్టేట్ వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు
- ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారుల తనిఖీలు
- వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు
చైతన్యపురిలోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాస అచ్యుతరావు నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మలక్పేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ నివాసంలో, ఆయనకు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు 40 బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు దస్త్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో గత నెల 23వ తేదీన విస్తృతంగా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.