రాజ్‌నాథ్ సింగ్ కాళ్లు మొక్కిన బండి సంజయ్

Bandi Sanjay touches Rajnath Singh feet
  • రాడార్ శంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన రాజ్‌నాథ్ సింగ్
  • హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రికి బీజేపీ నేతల ఘన స్వాగతం
  • శాలువా కప్పి సన్మానించిన బండి సంజయ్
కేంద్ర సహాయమంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాళ్లు మొక్కారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ శంకుస్థాపన కార్యక్రమం కోసం రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు.

హైదరాబాద్ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కేంద్రమంత్రికి శాలువా కప్పిన బండి సంజయ్.. అంతకుముందు ఆయన పాదాలను తాకారు.
Advertisement
Bandi Sanjay
Raj Nath Singh
BJP
Telangana

More Telugu News