Siraj: క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‍‌కు డీఎస్పీ పోస్ట్ కేటాయింపు

Mohammad Siraj on assuming charge as DSP
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్‌ను కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ ఆయనకు డీఎస్పీ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టును కేటాయించారు.
Go Back to Shorts
Siraj
Cricket
Hyderabad

More Telugu News