ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన
- బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్ర వాయుగుండంగా మారొచ్చని అంచనా
- ఏపీకి మరో తుపాను ముప్పు పొంచివుందని అప్రమత్తత
- ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరాన్ని దాటే ఛాన్స్
- ఈ నెల 14 -16 మధ్యలో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనాగా ఉంది. ఒకవేళ వాయుగుండం కాస్తా తుపానుగా బలపడితే ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటవచ్చని, అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపానుపై మరింత స్పష్టత వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు పల్నాడు, శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో నేడు (గురువారం) పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.