అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి.. బంగ్లాదేశ్‌పై భారత్ రికార్డు విజయం
- రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై 86 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
- 2-0 తేడాతో సిరీస్ సొంతం
- 74 పరుగులు చేసి, 2 వికెట్లు తీసిన నితీష్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
భారత బౌలర్లలో నితీష్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 16, లిట్టన్ దాస్ 164, నజ్ముల్ హొస్సేన్ శాంటో 11, తౌహిద్ హృదయ్ 2, మహ్మదుల్లా 41, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్ 16, జాకర్ అలీ 1, రిషద్ హుస్సేన్ 9, తంజిమ్ హసన్ సకీబ్ 8, తస్కిన్ అహ్మద్ 5 (నాటౌట్), ముస్తాఫిజుర్ రహ్మాన్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
అంతకుముందు భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, నితీష్ రెడ్డి 74, హార్దిక్ పాండ్యా 32, రియాన్ పరాగ్ 15, రింకూ సింగ్ 53, వాషింగ్టన్ సుందర్ 0, వరుణ్ చక్రవర్తి 0, అర్ష్‌దీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ అత్యధికంగా 3 వికెట్లు తీయగా.. తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ సాకీబ్, ముస్తాఫీజుర్ తలో రెండేసి వికెట్లు తీశారు. 74 పరుగులు బాదడంతో పాటు 2 కీలకమైన వికెట్లు తీసిన నితీష్ కుమార్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.