రతన్ టాటా ఆరోగ్యం విషమం!
- రతన్ టాటా ఆరోగ్యం క్రిటికల్ గా ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు
- ముంబైలోని ఓ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న టాటా
- తాను బాగున్నానని రెండు రోజుల క్రితం చెప్పిన రతన్ టాటా
86 ఏళ్ల రతన్ టాటా ఆరోగ్యం గురించి ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, గత సోమవారం రతన్ టాటా స్వయంగా స్పందిస్తూ... తన వయసుకు సంబంధించిన కారణాల వల్ల రొటీన్ మెడికల్ చెకప్స్ చేయించుకుంటున్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం.