Tirumala: హనుమంత వాహనంపై శ్రీవారి అభయం

brahmotsavam celebrations in tirumala
  • వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • సాయంత్రం శ్రీవారి స్వర్ణ రథోత్సవం 
  • రాత్రి స్వామివారికి గజ వాహన సేవ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముడి అలంకరణలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని దర్శించుకున్న వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని నమ్మకం. విశేష సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు వాహన సేవను తిలకించారు. ఈ రోజు సాయంత్రం స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రికి స్వామివారికి గజ వాహన సేవ నిర్వహిస్తారు
Tirumala
brahmotsavam celebrations
TTD

More Telugu News